పట్టభద్రుల ఓటు ఇలా వేయాలి
విధానం తప్పితే ఓటు చెల్లదు .
నల్గొండ , వరంగల్ , ఖమ్మం , పట్టభద్రుని నియోజకవర్గం ఉపయోగించిన ఓటింగ్ ఈనెల 27న జరగనున్నది .మొత్తం 46 ,1806 మంది ఓటర్లు ఉన్నారు . దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించిన కమిషన్ఓటు హక్కు కల్పించింది . అయితే సాధారణ ఎన్నికలకు , ఎమ్మెల్సీ ఎన్నికలకు , ఓటింగ్ లో తేడాలు ఉన్నాయి . చాలా మంది ఓటు వేసే విధానం తెలియక చేసే పొరపాట్లతో ఓటు మునిగిపోయే అవకాశం ఉంది .ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎం , వివి పాడ్స్ ఉండవు . బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది . బ్యాలెట్ ను జాగ్రత్తగా పరిశీలించి ఓటు వేయాల్సి ఉంటుంది . అది ఎలా వేయాలో ఒకసారి చూద్దాం .
ఓటింగ్ విధానం
1. ఓటు వేయటానికి ఓటర్స్ స్లిప్ , ఏదైనా ఒక ఓటర్ ఐడి కార్డ్ తీసుకెళ్లాలి .
2. పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ , పెన్ను ఇస్తారు వాటిని ఉపయోగించాలి.
3. బ్యాలెట్ పేపర్ లోపోటీ చేసిన అభ్యర్థుల పేరు , పార్టీ , పక్కన బాక్స్ ఉంటాయి.
4. ఎంతమంది పోటీ చేస్తే అందరివి ఉంటాయి.
5. పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో వన్ (1) ,టూ (2) , త్రీ (3) , ఫోర్(4) ఇలా ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి.
6. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి.
7. ఒక్కరికి ఓటు వేయవచ్చు లేదా కొంతమందికి లేదా అందరికీ వేయవచ్చు . అది మన ఇష్టం కానీ ప్రాధాన్యత తప్పవద్దు.
ప్రాధాన్యత ఎలాగో చూద్దాం
ఉదాహరణకు మొత్తం 70 మంది అభ్యర్థులు ఉన్నారు .
ఆరుగురికి మాత్రమే ఓటు వేద్దాం అనుకుంటే బ్యాలెట్ పేపర్ పరిశీలించి అందులో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలనుకుంటే ఫోటో ఎదురుగా ఉన్న బాక్సులో ఒకటవ నెంబర్ (1) రాయాలి .
మిగతా ఎంచుకున్న ఐదుగురి ఫోటోల ఎదురుగా ఉన్న బాక్సుల్లో రెండు(2), మూడు(3) , నాలుగు(4) , ఐదు(5) , ఆరు(6) నెంబర్లు రాయాలి .
ఒకవేళ వన్ , టూ , త్రీ నెంబర్లు వేసిన తర్వాత నాలుగో నెంబర్ మిస్ చేసి ఐదో నెంబర్ వేస్తే ఓటు చెల్లదు.
ఒకటే నెంబర్ వదిలేసి మిగతా రెండు ,మూడు, నాలుగు ,ఐదు, ఆరు నెంబర్లు వేసిన ఆ ఓటు చల్లుబాటు కాదు .
బ్యాలెట్ పేపర్ పై రోమన్ అంకెలను రాయకూడదు .
ఒకటి రెండు అని తెలుగులో కూడా రాయకూడదు .
రైట్ మార్క్ లాక్టిక్ చేయవద్దు .
ఎక్కడ సంతకం పెట్టవద్దు .