జిల్లా కలెక్టర్ (షె. కు. ) శాఖ కార్యాలయము, సూర్యాపేట
:: పత్రిక ప్రకటన ::
ఆర్.సి.నెం. ఎ/144/2024, తేది.17.05.2024.
సూర్యాపేట జిల్లాలో చదువుతున్న యస్.సి. విద్యార్థినీ/విద్యార్థుల కొరకు 2024-25 విద్యా సంవత్సరమునకు బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద ఇంగ్లిష్ మీడియం 1వ తరగతి ( డే స్కాలర్ ) మరియు 5వ తరగతి ( రెసిడెన్సియల్) విద్యార్థినీ/ విద్యార్థుల నుండి ధరఖాస్తులు కోరనైనదని జిల్లా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి శ్రీమతి కె. లత ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థినీ/ విద్యార్థులు వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం తేది 01.04.2024 తర్వాత రూ. 1,50,000/- లోపు గ్రామీణ ప్రాంతములలో నివసించేవారికి, మరియు 2,00,000/- లోపు పట్టణ ప్రాంతములలో నివసించే వారికి ఉండవలెను. కుల, ఆదాయ, జనన ధృవీకరణ పత్రము ( మీ సేవాచే ధృవీకరణ పత్రము సమర్పణ), రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ప్రస్తుతము చదువుతున్న పాటశాలబోనోఫైడ్, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో తేది 18.05.2024 నుండి కార్యాలయ పని దినాలలో జిల్లా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి కార్యాలయం, రూమ్ నెం.3, మొదటి అంతస్తు, కలెక్టరేట్ కాంప్లెక్స్, సూర్యాపేట నందు దరఖాస్తు ఫారములుపొందగలరు.
పూర్తి చేసిన దరఖాస్తు ఫారములను తేది. 07.06.2024 సాయంత్రం 5-00 గంటల వరకు జిల్లా పెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి కార్యాలయము, సూర్యాపేట నందు సమర్పించగలరు. ఈ పధకమునకు దరఖాస్తు చేసుకునే విధ్యార్థినీ/ విద్యార్థుల కుటుంబ సభ్యులలో గతములో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు గానీ, బెస్ట్ అవైలబుల్ స్కీం క్రింద గాని చదువుతున్నట్లు అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకునుటకు అవకాశం లేదు. దీనికి సంబంధించిన “డ్రా” కలెక్టరేట్ మీటింగ్ హాల్, కలెక్టరేట్ కాంప్లెక్స్, సూర్యాపేటలో తేది. 11.06.2024న ఉదయం 11.00 గంటలకు “డ్రా” తీయబడును.
గమనిక :- 1వ తరగతిలో దరఖాస్తు చేసుకొనుటకు తేది. 13.06.2018 నుండి 12.06.2019
వరకు గల మద్య కాలములో జన్మించిన వారు మాత్రమె అర్హులు.
| ఆలస్యముగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
Required Certificates :
1 . కుల,
2 . ఆదాయ,
2. జనన ధృవీకరణ పత్రము ( మీ సేవాచే ధృవీకరణ పత్రము సమర్పణ),
4 . రేషన్ కార్డ్,
5. ఆధార్ కార్డ్,
6.ప్రస్తుతము చదువుతున్న పాటశాలబోనోఫైడ్,
7. రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటో
Address :
జిల్లా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి కార్యాలయం,
రూమ్ నెం.3,
మొదటి అంతస్తు,
కలెక్టరేట్ కాంప్లెక్స్,
సూర్యాపేట.
జిల్లా కలెక్టర్ (షె.కు.) శాఖ,
సూర్యాపేట గారి తరపున
Starting Date | 18-05-2024 |
Last Date | 07-06-2024 |
Selection Process | “డ్రా” |
“డ్రా” Date | 11-06-2024 |