English Proficiency Course In – EFLU


హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ- సెంట్రల్ యూనివర్సిటీ) – ఇంగ్లీష్ 40 గంటల ప్రొఫిషియెన్సీ కోర్సును నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించేం దుకు ఈ ప్రోగ్రామ్ ఉపకరిస్తుంది. కమ్యూనికేషన్కు అవసరమైన లిజెనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మొత్తం 200 సీట్లు ఉన్నాయి.

ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

కోర్సు వ్యవధి నాలుగు వారాలు. రోజుకు రెండు గంటలు చొప్పున వారా నికి అయిదు రోజులు తరగతులు నిర్వహిస్తారు. తరగతికి 30 నుంచి 35 మంది అభ్యర్థులు ఉంటారు. ఉదయం, సాయంత్రం బ్యాచ్లు నిర్వ హిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉం టుంది. కనీసం 80 శాతం అటెండెన్స్ తప్పనిసరి.

1 . మొదటి వారం ఇంగ్లీష్ లాంగ్వేజ్కు సంబం ధించి ఇంట్రడక్షన్స్, డిస్క్రిప్షన్, నెరేషన్, ప్లానింగ్ తరగతులు ఉంటాయి.

2 . రెండో వారంలో ఎక్స్ ప్లెయినింగ్, ఇన్ఫార్మింగ్, ఇన్స్ట్రక్టింగ్ / డైరెక్టింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్/రెస్పాండింగ్ అంశాలు
ఉంటాయి.

3 . మూడో వారంలో ఎక్స్ ప్రెసింగ్ ఒపీని యన్, గ్రూప్ డిస్కషన్స్, నోట్ టేకింగ్ అండ్ సమ్మరైజింగ్, ఫార్మల్ లెటర్ రైటింగ్ ఉంటాయి.

4 . నాలుగో వారంలో సీవీ అండ్ అప్లికేషన్, లెటర్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, అఫీషియల్ రైటింగ్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. రీసెర్చ్ స్కాలర్స్, టీచింగ్ అసి స్టెంట్లు క్లాస్ రూం తరగతులు నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన మెటీరియల్ ఫొటోకాపీ ఇస్తారు. నిబంధనల ప్రకారం కోర్సు పూర్తిచేసిన వారికి మాత్రమే సర్టిఫికెట్లు పంపుతారు.

గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. వీసా, రెసిడెంట్ పర్మిట్ ఉన్న విదేశీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో కనీసం 50 శాతం మార్కులు
ఉండాలి.


కోర్సు ఫీజు:

భారతీయ విద్యార్థులకు రూ.2,500; విదేశీ విద్యార్థులకు రూ.5,000; ఇఫ్లూ లో చదువుతున్న విదేశీ విద్యార్థులకు రూ.4,000

దరఖాస్తు సబ్మిషన్ కు చివరి తేదీ : June 18

దరఖాస్తు ఫీజు: 100Rs


దరఖాస్తుకు జతచేయాల్సినవి:

రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డ్/ఓ టర్ ఐడీ/పాస్పోర్ట్


కోర్సు ప్రారంభం : జూలై 3 నుంచి

వెబ్సైట్: www.efluniversity.ac.in

Last Date 18-06-2024
Course Start Date03-07-2024
Official WebsiteClick Here