Admissions In Sri Venkateswara Veda Vijnana Peethams,TTD -2024-25


తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)- తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న వేద విజ్ఞాన పీఠాల్లో ప్రవే శాలకు నోటిఫికేషన్ వెలువడింది. వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం పూర్తిచేసుకొన్న బాలురు దరఖాస్తు చేసుకోవచ్చు. వేద సంబంధిత కోర్సులకు నిర్దేశించిన ప్రకా రం వయసు, విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థులు టీటీడీ వెబ్సైట్లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని నింపి తాము చేర దలచుకొన్న వేద విజ్ఞాన పీఠానికి పంపుకోవాలి. వేద


1 . ఎస్.వి.వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల *

2 . ఎస్.వి.వేద విజ్ఞా పీఠం,కీసరగుట్ట,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా

3 . ఎస్.వి. వేద విజ్ఞాన పీఠం, ఐ.భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా


4. ఎస్.వి. వేద విజ్ఞాన పీఠం, శ్రీమద్రామాయణ ప్రాంగణం, రామనారాయణ సారిక దగ్గర, విజయ నగరం జిల్లా

5. ఎస్.వి. వేద విజ్ఞాన పీఠం, ఎ.ఎం.ఆర్.ఎస్.ఎల్.బీ.సీ క్యాంపస్, పానగల్, రామగిరి, నల్లగొండ జిల్లా

6 . ఎస్.వి. వేద విజ్ఞాన పీఠం, శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, కోటప్పకొండ, గురవాయపాలెం పోస్టు, వయా సాతులూరు, నర్సరావుపేట, గుంటూరు జిల్లా

రుగ్వేదం (శాకల శాఖ), శుక్ల యజు ర్వుదం(కాణ్వశాఖ), కృష్ణ యజుర్వేదం (తైత్తిరీయ శాఖ), సామవేదం (కౌథుమ శాఖ), సామవేదం (జైమినీయ శాఖ), సామవేదం (రాణాయనీయ శాఖ) కోర్సుల వ్యవధి పన్నెండేళ్లు.

.కృష్ణ యజుర్వేదం (మైత్రాయణీయ శాఖ), అథర్వణ వేదం (శౌనక శాఖ) కోర్సుల వ్యవధి ఏడేళ్లు. వీటికి అయిదోతరగతి ఉత్తీర్ణులైన బాలురు అప్లయ్ చేసుకోవచ్చు.

వయసు : పది నుంచి పన్నెండేళ్ల మధ్య ఉండాలి. దివ్య ప్రబంధం, వైఖానసాగమం, పాంచరాత్రాగమం, చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం, శైవా గమం, తంత్రసార ఆగమం, రుగ్వేద స్మార్తం(ఆశ్వలా యన), శుక్ల యజుర్వేద స్మార్తం (పారస్కర), కృష్ణయజు ర్వేద స్మార్తం(ఆపస్తంబ), వైఖానస స్మార్తం, ఆపస్తంబ పౌరోహిత్యం(స్మార్తం), బోధాయనీయ పౌరోహిత్యం( స్మార్తం) కోర్సుల వ్యవధి ఎనిమిదేళ్లు. కనీసం ఏడోతరగతి ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అప్లయ్ చేసుకోవచ్చు.

వయసు: 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉండాలి.


ఆ దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూన్ 20

వెబ్సైట్: www.tirumala.org

Age 12 – 14 years
Qualification : 5th & 7th classes
Last Date20-06-2024
Official WebsiteClick Here