Andhra యూనివర్సిటీ(విశాఖపట్నం) ఆధ్వర్యంలోని కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ- ‘నాలుగేళ్ల బీఎస్సీ ఆనర్స్ + ఏడాది ఎమ్మెస్సీ‘ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ప్రోగ్రామ్ స్పెషలైజేషన్ ‘ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’. ఏడాదికి రెండు చొప్పున మొత్తం పది సెమి స్టర్లు ఉంటాయి. ఇది సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్. ఇందులో మొత్తం 44 సీట్లు ఉన్నాయి.
వీటిలో నాలుగు సీట్లను ఈడబ్ల్యూఎస్ వర్గానికి కేటాయించారు. అకడమిక్ మెరిట్, కౌన్సెలింగ్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఉండవు. ఎన్ఎస్ఈపీ నిబంధనల ప్రకారం ఏటా నిర్దేశిత కోర్సులు పూర్తిచేసి ప్రోగ్రామ్ నుంచి వైదొలగవచ్చు. మొదటి సంవత్సరం సర్టిఫికెట్, రెండో ఏడాది డిప్లొమా, మూడో ఏడాది డిగ్రీ, నాలుగో ఏడాది ఆనర్స్ అయిదో ఏడాది మాస్టర్స్ డిగ్రీ పొందవచ్చు.
అర్హత వివరాలు:
గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు 45శాతం చాలు.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు ఫీజు: రూ.2,000 = కౌన్సెలింగ్ ఫీజు: రూ.600
దరఖాస్తు సబ్మిషన్కు చివరి తేదీ: జూన్ 12 = కౌన్సెలింగ్: జూన్ 14
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
డైరెక్టర్, డైరె క్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజ యనగర్ ప్యాలెస్, పెద వాల్తేర్, విశాఖ పట్నం-530017
” వెబ్సైట్: www.andhrauniversity.edu.in
Application Fee | Rs 2000 |
Counciling Fee | Rs 600 |
Official Website | Click Here |