Diploma In Agriculture – The Professor Jayashankar Telangana State Agricultural University.

హైదరాబాద్-రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎస్ఏయూ) – డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడు దల చేసింది. అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నాయి. అగ్రికల్చరల్ స్ట్రీమ్లో తెలంగాణ పాలి సెట్ 2024 ర్యాంక్ ఆధారంగా అభ్యర్థు లను ఎంపిక చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలల్లో 260 సీట్లు, అనుబంధ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 540 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు నిర్దేశించారు. గ్రామీణ పాఠశాలల్లో కనీసం నాలుగేళ్లు చది విన విద్యార్థులకు ప్రతి విభాగంలో 60 శాతం సీట్లు కేటాయించారు. ఈ ప్రోగ్రామ్లను ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో డిప్లొమాలు


డిప్లొమా ఇన్ అగ్రికల్చర్:

ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 240 సీట్లు ఉన్నాయి. జోగిపేటలో బాలికల పాలిటెక్నిక్; బసంత్పూర్, జమ్మికుంట, మృుమ్మెదలలో బాలుర పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. వీటితోపాటుపాలెం, పొలాస, కంపసాగర్, మధిర,
సిరిసిల్లా, రుద్రూర్ పాలిటెక్నిక్ కళాశా లల్లో ఒక్కోదానిలో 20 సీట్లు; నారాయణ పేట పాలిటెక్నిక్ కళాశాలలో 40 సీట్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీ అను బంధ కళాశాలల్లో మొత్తం 390 సీట్లు ఉన్నాయి.

డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ : ప్రోగ్రామ్వ్యవధి మూడేళ్లు.

సంగారెడ్డి- కందిలోని అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్లో 20 సీట్లు ఉన్నాయి. మెదక్-తునికి, ఖమ్మం-సత్తుపల్లి, సంగారెడ్డి-తుర్కాల ఖానా పూర్లలో ఉన్న అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఒక్కోదానిలో 30 చొప్పున మొత్తం 90 సీట్లు ఉన్నాయి.


డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ : ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు.

వికారాబాద్-గింగుర్తిలోని ఏకలవ్య ఆర్గా నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో 60 సీట్లు ఉన్నాయి.


అర్హత వివరాలు :

ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ స్టేట్ బోర్డ్ నిర్వహించే పదోతరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎస్ఐఓఎస్, తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీల అభ్య ర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 35 శాతం మార్కులు తప్పనిసరి. అగ్రికల్చరల్ విభా గంలో తెలంగాణ పాలిసెట్ 2024 ర్యాంక్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 2024 డిసెంబరు 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి 22 ఏళ్లు.



ముఖ్య సమాచారం

  • రిజిస్ట్రేషన్ ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1200, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600
  • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : జూన్ 25
  • ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 26
  • వెబ్సైట్ : diploma.pjtsau.ac.in

    ఆన్లైన్ దరఖాస్తులో కరెక్షన్స్ : జూన్ 27
Last Date For Registration25-06-2024
Last Date For Online Application26-06-2024
Official WebsiteClick Here
Last Date For Correction 27-06-2024