Indian Army -10+2 Technical Entry Scheme

కోర్సు, శిక్షణ..

కోర్సు, శిక్షణ ఐదేళ్లు కొనసాగుతుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పాటు ప్రాథమిక మిలటరీ శిక్షణ అందిస్తారు. అనంతరం నాలుగేళ్లు టెక్నికల్ ట్రైనింగ్ పుణె, సికింద్రాబాద్, మావ్ లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్క డైనా కొనసాగుతుంది.

ఇందులో రెండు దశలు. .

ఫేజ్-1 మూడేళ్ల ప్రీ కమిషన్ ట్రైనింగ్,

ఫేజ్- 2 ఏడాది పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ ఉంటాయి.

మూడేళ్ల ఫేజ్-1 శిక్షణ పూర్తిచేసుకుని, ఫేజ్- 2లో చేరినప్పుడు ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ అందుతుంది. నాలుగేళ్ల శిక్షణ పూర్త యిన తర్వాత లెఫ్టినెంట్ హోదా దక్కుతుంది.

సుమారు ఏడాదిశిక్షణ, కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ అందిస్తుంది. వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు. లెవెల్ -10 మూలవేతనం రూ.56,100, మిలటరీ సర్వీస్ పే రూ.15,500 ప్రతి నెలా అందుతాయి. డీఏ, హెచ్ఎర్ఎ, పలు ప్రోత్సాహకాలూ దక్కు తాయి.

మొదటి నెల నుంచే అన్నీ కలిపి దాదాపు లక్ష రూపాయలు అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకో వచ్చు. రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సర్వీ స్లో మేజర్, పదమూడేళ్లకు లెఫ్టినెంట్ కల్నల్ హోదాలను వీరు పొందగలరు. ఈ విధానంలో ఎంపికైనవాళ్లు పదవీ విరమణ వయసు వరకు లేదా ఆసక్తి ఉన్నంత కాలం విధుల్లో కొనసాగ వచ్చు. ఇవి శాశ్వతం (పర్మనెంట్) ఉద్యోగాలు అందువల్ల వీరికి పూర్తి పింఛను అందుతుంది.

16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 2, 2005 – జులై 1, 2008 మధ్య జన్మించిన వారే అర్హులు.

ఆన్లైన్ దరఖాస్తులు : జూన్ 13 వరకు స్వీకరిస్తారు.

వెబ్సైట్ : https://joinindianarmy.nic.in/index.htm

Last Date for Application 13-06-2024
Official WebsiteClick Here