Lateral Entry Program In Osmania University( B.E/B.Tech)

ఉస్మానియా వర్సిటీలో లేటరల్ ఎంట్రీ :

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ‘యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్- బీఈ/ బీటెక్ ప్రోగ్రామ్లలో లేటరల్ ఎంట్రీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘కంటి న్యూయింగ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీప్)’ కింద నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ లను డిప్లొమా పూర్తిచేసిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకించారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్, కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఈ / బీటెక్ రెండో ఏడాది ప్రవేశాలు కల్పి స్తారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.


స్పెషలైజేషన్లు-సీట్లు
: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎల క్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్లో 30 సీట్లు చొప్పున మొత్తం 120 సీట్లు ఉన్నాయి.


ప్రోగ్రామ్ వివరాలు : ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. సాయంత్రం సమయాల్లో ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు తరగతులు నిర్వహిస్తారు. సెమిస్టర్కు ట్యూషన్ ఫీజు రూ.50,000.


అర్హత : తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐ&ఎంఎల్ స్పెషలైజేషన్కు ఏ విభాగంవారైనా అప్లయ్ చేసుకోవచ్చు. సీఎస్ఈ/ఏఐ/ఏఐ ఏఐఎం/ఎంఈసీఎస్బీ/ సీఎస్సీ/ సీఎ/ సీఎస్/ సీఎస్ఎస్ఐ/ సీఎస్ఎం/ సీఎస్ఎన్/ సీఎస్ఏ/సీఎస్/సీఎస్ డబ్ల్యూ/ సీఐసీ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు.

జనరల్ అభ్యర్థులకు కనీసం 45 శాతం, రిజర్వుడ్ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థులందరికీ కనీసం ఏడాది ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ అనుభవం తప్పనిసరి.


ఎంట్రెన్స్ టెస్ట్ : దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో అర్హత సాధించాలంటే జనరల్, బీసీ అభ్యర్థు లకు కనీసం 36 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 15 శాతం మార్కులు రావాలి. పరీక్ష సిలబస్ను వెబ్సైట్లో చూడవచ్చు.

  • దరఖాస్తు ఫీజు : రూ.2,000 *
  • దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 20
  • దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు : డిప్లొమా సర్టిఫికెట్-మార్కుల పత్రాలు, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, పదోతరగతి సర్టిఫికెట్, ఆరోతరగతి నుంచి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు, సర్వీస్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, జిరాక్స్ కాపీలు, రెండు ఫొటోలు.
  • ఫలితాలు విడుదల : జూలై 12
  • ఎంట్రెన్స్ టెస్ట్కు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల : జూలై 2
  • ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ : జూలై 7
  • మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ : జూలై 20
  • రెండో ఫేజ్ కౌన్సెలింగ్ : జూలై 27
  • వెబ్సైట్ : www.osmania.ac.in
Last Date20-06-2024
Exam Date07-07-2024
Results12-07-2024
Apply OnlineClick Here